సంతోషకరమైన వివాహజీవితానికి అవసరమైన కృప అంతటిని దేవునిలోనుండి పొందుకొనుట గురించి పేతురు మాట్లాడుచున్నాడు, “అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్ధనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి” (1 పేతురు 3:7).
క్రైస్తవవివాహము చేసుకున్న భార్యభర్తలు సమాధానముతో అన్యోన్యము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పోట్లాటలు, జగడములతో ఉన్న ఈ లోకములో వారి ఇళ్లు సమాధానముతో నిండినదై ఉండాలి. దాని కొరకు ఎంతో సమృద్ధియైన దేవుని కృప అవసరము.
తరువాత ఆత్మీయ కృపా వరములనుగూర్చి పేతురు మాట్లాడుచున్నాడు, “దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహనిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందినకొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి” (1 పేతురు 4:10). దేవుని సత్యమైన కృప మనలోనుండి వేరే వారిలోనికి పంపిణీ జరిగి, ఆ కృప వారిలో విస్తరించునట్లు దేవుడు మనకనుగ్రహించిన ప్రతి కృపావరముతో ఒకనికొకడు ఉపచారము చేయాలి. అనేక విధములైన కృపను దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు. కాబట్టి అనేకవిధములైన వ్యక్తిత్వము, అనుభవము కలిగిన వారనేకులను దేవుడు క్రీస్తు శరీరమనే సంఘములో ఉంచి, ప్రతి సహోదరుడు లేక సహోదరి వారికున్న ప్రత్యేక కృపావరములను వారి జీవితము ద్వారాను మరియు వారు పరిచర్య ద్వారాను సంఘములోని ఇతరులలోనికి సరఫరా చేస్తారు.
“చిన్నలారా మీరు పెద్దలకు లోబడి యుండుడి. మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” (1 పేతురు 5:5). ఇక్కడ మీరు యౌవ్వనస్థులుగా ఉన్నప్పుడే ఆత్మీయ అధికారానికి లోబడుటలోనున్న ప్రాముఖ్యతనుగూర్చి పేతురు మాట్లాడుచున్నాడు. ఒక యౌవ్వనస్థుడు 20 సం||ల వయస్సులో రక్షింపబడినట్లయితే, అతనికి 35 సం||ల వయస్సు వచ్చేసరికి అతడు ఫలభరితమైన పరిచర్య కలిగియుండుట దేవుని చిత్తము. కాని ఇది నెరవేరాలంటె, 35 సం||ల లోపే అతడు విరుగగొట్టబడుట మరియు దీనత్వము అనే పాఠములు నేర్చుకోవాలి. ఆత్మీయ అధికారానికి (పెద్దలకు) లోబడుటద్వారానే అతడు ఈ పాఠాలు నేర్చుకొనగలడు. అప్పుడు మాత్రమే తన ఇంటిలోగాని లేక సంఘములోగాని అతడు ఆత్మీయ అధికారము కలిగి యుండుటకు కావలసినంత కృపను పొందుకుంటాడు. ఏ యౌవ్వనస్థులైతే ఆ విధముగా ఆత్మీయ అధికారానికి విధేయత చూపరో వారు, దేవుడు వారిద్వారా చేయాలనుకున్న పరిచర్యను వారు పోగొట్టుకుంటారు. అనగా మనము పెద్దవాళ్లమైన తరువాత దీనులముగా ఉండవద్దనికాదు. పెద్దలకు లోబడుట అనేది చిన్న వయస్సులోనే నేర్చుకోవాలి. అయితే మనము చనిపోయే దినము వరకు దీనులమై ప్రభువైనయేసును వెంబడించాలి. జీవితాంతము క్షణక్షణము దేవుని కృపను పొందుకొనే మార్గము దీనత్వము ఒక్కటే (అనగా ఎల్లప్పుడు మనకు దేవుడు ఎంత అవసరమో ఎరిగి యుండుట).
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప నిచ్చును. మనము గర్విష్టులమైనట్లయితే మన సిద్ధాంతములన్నియు సరిగా ఉన్నప్పటికీ, ఆ ఆత్మీయ సత్యముల విషయములో మోసపోయి, గ్రుడ్డివారమై చివరకు పరిసయ్యులుగా మారెదము. అప్పుడు పరిసయ్యులు ఎలాగైతే నిజమైన ప్రవక్తయైన యేసును గుర్తించనట్లే, ఈనాడు నిజమైన ప్రవక్తను మనము గుర్తించలేము.
పాపమంతటికీ మూలాధారము గర్వము మరియు స్వార్ధము. అదేవిధముగా క్రీస్తుయొక్క సద్గుణములన్నిటికీ మూలాధారము దీనత్వము మరియు నిస్వార్ధము. మనలను మనమెంత తగ్గించుకుంటామో అంతగా కృప వెంబడి కృపను పొందుతూ ఉంటాము. ఆవిధముగా దేవుని కృపద్వారా మనము జయము పొంది, అంతకంతకు మరి ఎక్కువగా క్రీస్తుయొక్క స్వభావమును మనము వ్యక్తపరచెదము. ఎవరైనను పాపముమీద జయము పొందనట్లయితే, అతడు తనను తాను తగ్గించుకొనలేదని స్పష్టమగుచున్నది. ఎందుకనగా తమ్ముతాము తగ్గించుకొనువారందరు నిశ్చయముగా కృప పొందుదురు (1 పేతురు 5:6). మరియు ఎవరైతే దేవుని కృపలో నిలిచి ఉంటారో వారందరు జయమును పొందెదరు (రోమా 6:14).