WFTW Body: 

ఎఫెసీ 1:18లో "మీ హృదయ(మనో)నేత్రములు తెరువబడునట్లు ప్రార్ధిస్తున్నానని" పౌలు చెప్పుచున్నాడు. క్రొత్తనిబంధనలో హృదయానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. పాతనిబంధనలో కేవలం తెలివి గురించి చెప్పబడింది. కాని ఇప్పుడు దేవుని జీవపువెలుగు మన హృదయములో ప్రవేశించాలి.

పాతనిబంధనలో కొద్దిమంది మాత్రమే దేవుని హృదయానుసారులున్నారు. సామెతలలో హృదయం గురించి చాలా చెప్పబడింది. దావీదు దేవుని హృదయానుసారుడు. కాని సామాన్యముగా యాజకులు మరియు ధర్మశాస్త్రబోధకులు హృదయానుసారులు కాదు. ప్రభువైనయేసును సిలువవేసిన శాస్త్రులును మరియు పరిసయ్యులును తయారుచేయబడ్డారు. నీవు లేఖనములను కేవలం అక్షరానుసారముగా చదివి, ధ్యానించి బైబిలును బాగా తెలుసుకున్నట్లయితే నీకు కూడా శాస్త్రిగాగాని లేక పరిసయ్యుడుగాగాని మారెదవు. దేవునిసత్యము నీ తలలో నుండి హృదయములోనికి దిగివచ్చినప్పుడు, ఆ సత్యమే నీకు ప్రత్యక్షత అవుతుంది. ఆ 12 అంగుళాలే ఎంతో వ్యత్యాసాన్ని తెస్తుంది.

పౌలు ఈ విధంగా ప్రార్ధించాడు, "వారి మనోనేత్రములు వెలిగింపబడి ఈ విషయాలను చూడాలి:

1. ఆయన మనలను పిలిచినపిలుపు వలన మనము పొందిన నిరీక్షణ ఎంత గొప్పదో;

2. పరిశుద్ధులలో ఆయన ఉంచిన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో;

3. ఆయన క్రీస్తులో వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మనలో ఆయన ఉంచిన తన శక్తియొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో అని మనము తెలుసుకోవాలి(ఎఫెసీ 1:17-19)".

ఈ సత్యములను 25సార్లు చదివి అర్ధం చేసుకోమని పౌలు వారికి చెప్పలేదు. 100సార్లు చదివి కూడా అర్ధం చేసుకోకపోవచ్చును. వాటిని ప్రార్ధనగా చేయుట ద్వారా ప్రత్యక్షత పొందుకుంటాము కాబట్టి పరిశుద్ధాత్మ నుండి ప్రత్యక్షత పొందుటకు పౌలు ప్రార్ధించాడు. బైబిలులోని హెబ్రీ మరియు గ్రీకు పదముల అర్ధమేమిటో నీవు చదివినప్పటికీ నీవు ఆత్మీయముగా గ్రుడ్డివాడవైయుండి మరియు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవించకపోవచ్చును లేక మనము దేవునిచేత ఏర్పరచబడినట్లుగా ఆయన యెదుట పరిశుద్ధులమును, నిర్ధోషులమును అవ్వలేకపోవచ్చును. బైబిలు మీద పరిశుద్ధాత్మలో నుండి మనం ప్రత్యక్షత పొందినట్లయితే(ప్రార్ధించుటద్వారా), పరిస్థితులు వేరుగా ఉంటాయి. నీకు గ్రీకుభాష తెలియకపోవచ్చును గాని నీవు క్రీస్తును అనుభవపూర్వకముగా ఎరుగుదువు. నీవు క్రీస్తులో ఉంటావు. బైబిలులోని దేవుని వాగ్దానాలనే చెక్కులు పరిలోకపు బ్యాంకులో నుండి పొందుకొని మరియు ఆత్మీయముగా ధనవంతుడవు అవుతావు. కాబట్టి ప్రత్యక్షత లేకుండా బైబిలును చదువుటకు ప్రయత్నించవద్దు. పరిశుద్ధాత్మ నుండి ప్రత్యక్షత పొందుటకే బైబిలు చదవాలి. ఎవరైనా ప్రత్యక్షతకు కాకుండా బైబిలు జ్ఞానానికి నిన్ను నడిపించినట్లయితే నీవు తప్పిపోయెదవు. మనస్సును (మైండ్‍ను) ఉపయోగించుటకు నేను వ్యతిరేకిని కాదు. బైబిలు చదివుటకు మరియు బోధించుటకు మైండును ఉపయోగిస్తాను లేకపోతే నేను మీతో మాట్లాడలేను. అయితే నామనస్సును పరిశుద్ధాత్మకు అప్పగించాను. మనకళ్ళ(శరీరము)తో బైబిలు చదువుతాము. ఆ మాటలు మన మనస్సు(ప్రాణము)లోనికి వస్తాయి. మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షతను పొందునట్లు ఆ మాటలు మన ఆత్మలోనికి చొచ్చుకుపోవాలి.

మూడు భాగాలున్న ప్రత్యక్షగుడారములో ఒక ఉదాహరణ చూస్తాము. దేవుడువాక్యాన్ని చదువుటకుగాని లేక వినుటకుగాని మన వినియోగించే శరీరము ఆవరణకు సాదృశ్యముగా ఉన్నది. వాక్యాన్ని మనం అర్ధం చేసుకొని, స్పందించుటకు మనస్సును అనగా పరిశుద్ధస్థలానికి సాదృశ్యంగా ఉన్న ప్రాణం రెండవది. మనం విధేయత చూపగలుగునట్లు, అతిపరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న ఆత్మలోనికి వాక్యము వచ్చి, అక్కడ దేవునిలో నుండి ప్రత్యక్షతను పొందుకుంటాము. అటువంటి ప్రత్యక్షత వాక్యము ద్వారా దేవునిలో నుండి పొందుట ద్వారా దేవునిచిత్తమును నెరవేర్చగలము.

కాబట్టి దేవునిలో నుండి ప్రత్యక్షతను పొంది మరియు లోబడునట్లు మనం బైబిలు చదివి, ప్రార్ధించాలి. మనం అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించునట్లు ప్రభువైనయేసు మనకొరకు మరణించి మరియు తెరను రెండుగా చీల్చాడు (హెబ్రీ 10:19,20). పరిసయ్యులు బైబిలు చదివి కూడా అర్ధం చేసుకోలేక మరియు ప్రత్యక్షత పొందలేకపోవుటవలన ప్రభువైనయేసును దయ్యముల అధిపతియైన బయెల్జెబూలన్నారు. పేతురు మాత్రం లేఖనములలోని ప్రత్యక్షతను పొంది మరియు ప్రభువైనయేసు సజీవుడైనదేవుని కుమారుడనియు మరియు మెస్సయ్యా అనియు తెలుసుకున్నాడు.