వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

నీవు సుమారు 1960 సంవత్సరముల క్రితం ఇశ్రాయేలు దేశములో ఉన్నట్లును, అప్పుడు "నజరేయుడైన యేసు" అనే ఆయన రోగులను స్వస్థపరిచే పరిచర్య చేస్తున్నాడని విన్నావనుకో. నీవు ఆయనను ఎప్పుడూ చూడలేదు, కాని అనుకోకుండా యెరూషలేములో చాలా మంది ప్రజలు "యేసు" అనే ఆయన బోధించే స్వస్థత కూటానికి గుంపులుగా వెళ్ళే ప్రదేశానికి నీవు దగ్గర్లో ఉండడం నీకు సంతోషం కలిగించింది.

నీవు ఆ కూటము దగ్గరకు వచ్చినప్పుడు స్టేజి మీద "యేసు" (ఆ బోధకుడు) తో పాటు, పిలాతు, హేరోదు ఇంకా అన్న, కయప కూడా కూర్చొనియున్నారు. అప్పుడు ’యేసు’ ముందుకు వచ్చి జనసమూహముల నుద్దేశించి ఇశ్రాయేలు దేశములో గొప్ప లౌకికరాజ్య పరిపాలకులైన ఘనత వహించిన హేరోదు మరియు పిలాతు ఆ రోజు కూటమునకు వచ్చుట చేత వారి వలన కూటమునకు గౌరవము వచ్చినదని చెప్పెను. అంతేకాక "ఇద్దరు గొప్ప దైవ జనులు రైట్ రెవరెండు అన్న మరియు కయప ఆ రోజు కూటమును దీవించుటకు అక్కడున్నారు" అని చెప్పెను.

పరిచయ పూర్వకముగా ఈ మాటలు చెప్పిన తరువాత హేరోదు, పిలాతు ఆ కూటమును ప్రారంభించి కొద్ది మాటలు మాట్లాడమని ’యేసు’ ఆహ్వానించెను. అప్పుడు హేరోదు, పిలాతు ’యేసు’ను పొగుడుతూ ఆయన యొక్క పరిచర్య వలన సమాజమునకు ఎంతో మేలు జరుగుతున్నదనియు, ప్రజలందరి యొక్క మద్దతు పొందుటకు ఆయన అర్హుడని వారు చెప్పిరి. తరువాత రైట్ రెవరెండు అన్న, కయపలు కొద్ది మాటలు చెప్పి ప్రారంభ ప్రార్ధన ప్రార్ధించుటకు "యేసు"చే పిలువబడిరి. వారు కూడా ’యేసు’ను ఎంతగానో స్తుతించి వారి సంఘాల్లో నుండిన వారందరూ ’యేసు’ యొక్క పరిచర్యను వారి హృదయమంతటితో బలపర్చాలని చెప్పెను.

అటు తరువాత సేవ యొక్క ఆర్ధిక అవసరాలు తెలుపుటకై ’యేసు’, ఇస్కరియోతు యూదాను ఆహ్వానించెను. యూదా, సేవకు అవసరమైన వేలకొలది దేనారముల గూర్చి చెప్పెను. వాలంటీర్ల దగ్గర దరఖాస్తులు ఉంటాయనియు ఎవరైతే 1000 కంటే ఎక్కువ దేనారీలు విరాళముగా ఇచ్చెదరో వారి గూర్చి (వారు విశ్వాసులైనా, అవిశ్వాసులైనా ఫర్వాలేదు - ఇవ్వగలిగిన వారందరూ రావచ్చును, ఇంకా ఎక్కువ ఇవ్వగలిగినట్లయితే ఇంకా మంచిది) ’యేసు’ ప్రత్యేక ప్రార్ధనలు చేయునని ప్రకటించాడు. అప్పుడు హేరోదు లేచి ఈ సేవ కొరకు ఇచ్చు సొమ్ముపై ఆదాయపుపన్ను లేకుండా చేయుదునని ప్రకటించెను. అప్పుడు కానుకలు పట్టిరి. అప్పుడు ’యేసు’ ఒక క్లుప్తమైన ప్రసంగము చేసి, సామాన్యులు ఆశ్చర్యపోవునట్లు ఆయన యొక్క అద్భుత శక్తులను కొన్నిటిని చూపెను, కొందరు రోగులను స్వస్థపర్చెను. అదయిన తరువాత ఎవరైన ఆయనను కల్సుకొనుటకు అవకాశము లేకుండా ఆయన హేరోదు, పిలాతు, అన్న, కయపలతో పాటు రోమా రాజ్యమునకు సంబంధించిన రాజరధముపై యెరూషలేము మధ్యలో నుండిన ప్రధాన యాజకుని భవనానికి వారితో విందు చేయుటకు వెళ్ళిపోయెను.

ఇదంతా జరిగిన తరువాత, నీవు క్రొత్తగా క్రీస్తులోనికి మారిన వాడవైనప్పటికిని, నీకుండిన కొద్ది వివేచనతో అనుభవముతో నీ మనసులో అసౌఖ్యానికి గురి అయ్యావు. ఇంతవరకు నీవు చూసినదంతా నీవు అపోస్తలులైన మత్తయి, పేతురు, యోహానుల దగ్గర నుండి వినిన యేసును గూర్చిన సంఘటనలతో సరిపోవుట లేదు. అయినా సైతాను నీ చెవుల దగ్గరకు వచ్చి "తీర్పు తీర్చకూడదు" (మత్తయి 7:1) "అని వ్రాయబడియున్నది" అని చెప్పుచుండెను. కాని ’అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేదో పరీక్షించుడి’ (1 యోహాను 4:1) అని కూడా వ్రాయబడెను అని నీవు అతడితో చెప్పుము.

చివరకు నీవు ఒక నిర్ణయానికి వచ్చెదవు. ఇది నేను వినిన యేసు కాదు. ఇది తప్పక మరియొక ’యేసు’ (2 కొరంథీ 11:4).

చివరకు నీవు ఆ నిర్ణయానికి ఎలా వచ్చావు? నీలో నుండిన అభిషేకము ఈ క్రింది నిజాలను నీకు చెప్పినది.

1. నిజమైన యేసు ఈలోక అధిపతులు, పరిపాలకుల నుండి మద్దతు కాని తన పరిచర్యకు మారుమనస్సులేని మతపెద్దల నుండి సిఫార్సులు కాని కోరరు. అలాగే ఆయన వారెవరినీ పొగడ్తలతో ఎత్తి వేయరు. ఆయన యొద్దకు ఆ కాలపు బిషప్పు వచ్చినప్పుడు అతడు తిరిగి జన్మించాలని చెప్పారు (యోహాను 3:1-10) హేరోదు రాజును యేసు ’నక్క’ అని పిలిచారు (లూకా 13:31,32). అంతే కాకుండా అతడు ఆయనను కల్సుకొన్నప్పుడు అతడితో మాట్లాడటానికి తిరస్కరించారు కూడా (లూకా 23:8,9).

2. నిజమైన యేసు ఎప్పుడు ఎవ్వరినీ డబ్బు అడగరు. చివరకు అది తన పరిచర్య కోసమైనా, ఆయన అవసరములు తండ్రికి మాత్రమే తెలియజేయుదురు. అప్పుడు తండ్రి యేసు అవసరములు తీరునట్లు ప్రజలను లేక చేపనైనను (ఒక మారు అట్లు జరిగినది) కదిలించుదురు (లూకా 8:1-3, మత్తయి 17:27).

3. నిజమైన యేసు ఆయన ప్రార్ధనలనెప్పుడూ ధరకు అమ్మరు. సమరయలో గారడీవాడైన సీమోను ప్రార్ధనలకు పేతురుకు డబ్బు ఇవ్వబోయినప్పుడు, దైవికమైన వరమును డబ్బుతో కొనాలని అనుకొనిన దుష్టత్వమును గూర్చి పేతురు అతడిని గద్దించెను (అ.కా 8:18-23). సీమోను వెంటనే పశ్చాత్తాపపడెను. కాని అతడిని అనుసరించు వారు మారుమనస్సు పొందని వారు అనేకులు ఈ శతాబ్ధాలన్నిటిలో యున్నారు. రోమాన్ కేథలిక్ పోపులు (సీమోనును గద్దించిన పేతురు వారసులమని చెప్పుకొనే) వారి ప్రార్ధనలను డబ్బుకు అమ్ముకొనేవారు. మార్టిన్ లూథర్, ఆయన కాలంలో, పేతురువలె అటువంటి దుష్టత్వాన్ని ఎదురించెను. కాని లూథర్ తరువాత వచ్చిన వారిలో కొందరు (ఈనాటి ప్రొటెస్టెంటులు) తిరిగి ఆ పాత పద్ధతికి వెళ్ళిపోయి వారి "ప్రార్ధన" లను మరియు వారి "ప్రవచనాల"ను డబ్బుకు అమ్ముకొనుచున్నారు. అయ్యో! గారడీ సీమోను వలె వారికి డబ్బు చెల్లించుటకు జనులు సిద్ధముగా నున్నారు!

ఆఖరి దినాల్లో ఏర్పర్చుకొన్నవారు సహితము మోసగింపబడునట్లు మోసము చాలా కపటముగా నుండునని యేసు చెప్పారు. ముఖ్యముగా వారు సూచిక క్రియలతోను అద్భుతాలతోను మోసపోదురు (మత్తయి 24:14). ఈ రోజుల్లో ఏర్పర్చుకొనబడినవారు జాగ్రత్తగా నుండి బహు జాగ్రత్తగా పరీక్షించాల్సినది సూచకక్రియలు మరియు అద్భుతాలతో కూడిన పరిచర్యను. యేసుప్రభువు వారి గదిలోనికి వచ్చి మాట్లాడెనని చెప్పినప్పుడు నమ్మవద్దని యేసుప్రభువు మనతో చెప్పియుండెను (మత్తయి 24:16 చూడండి). పునరుత్థానమైన యేసు యొక్క శరీరము ఆయన ఆరోహణుడైన తరువాత ఇంతకాలము (సుమారు 1900 సంవత్సరాలపైన) ఎప్పుడూ తండ్రి కుడి పార్శ్వమును విడిచిపెట్టలేదు. పౌలు, స్తెఫెనులు ఆయనను అక్కడనే చూచిరి (అ.కా 7:56, 9:3). యోహాను కూడా పత్మాసు ద్వీపంలో యేసు యొక్క భౌతిక శరీరమును చూడలేదు కాని కేవలము పోలికలను మాత్రమే చూచెను (ప్రకటన 1:13-16). యేసుప్రభువు భూమిపైకి రెండవ రాకడతో వచ్చినప్పుడు మాత్రమే పరలోకమును విడిచిపెట్టును. అందువలన ఈ రోజుల్లో ఆయన వారి గదుల్లోనికి వచ్చెనని చెప్పినప్పుడు నమ్మవద్దు.

ప్రతి చిన్న అనుభవానికి ఆకర్షతులైపోయే విశ్వాసుల మధ్య జీవిస్తూ యుండినప్పుడు మనము వివేచన లేకుండా యుండకూడదు. ఈ ఆఖరి దినాల్లో కోరుకున్నవారికి తేటగా కనబడునట్లు దేవుని వాక్యము వెలుగునిచ్చును. మనము ఆ వెలుగును మాత్రము అనుసరించి వెళ్ళినట్లయితే, మన మెప్పుడును మోసపోము.