WFTW Body: 

యిర్మియా బాలుడుగా ఉన్నప్పుడే ప్రభువు అతడిని పిలిచెను (యిర్మియా 1: 5,6) మరియు అతనితో ఈలాగు చెప్పెను, "గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని". తనతల్లి గర్భములో రూపింపబడకమునుపే యిర్మియాను దేవుడు ఎరిగియున్నాడు. ఈదినములలో పిండము మనుష్యునిదా కాదా? అను వివాదము చాలా ఉన్నది. ఆ అనుమానము మరెన్నటికీ రాకుండునట్లు ఈ వచనము తెలియజేయుచున్నది- ఎందుకనగా రూపింపబడకమునుపే దేవుడు యిర్మియాను ఎరుగును. యిర్మియా తన తల్లి గర్భములో ఒకచిన్న అణువుగా ఉన్నప్పుడే, దేవుడతనిని ఎరిగి మరియు ప్రవక్తగా ప్రతిష్టించెను. మనము తల్లి గర్భములో అణువుగాఉండి గర్భము దాల్చినప్పుడే దేవునికనుదృష్టి మనమీద ఉన్నదని ఎరుగుట- మనకు ఎంతో ప్రోత్సాహముగా ఉన్నది. యిర్మియావిషయములో దేవుడు ప్రణాళిక కలిగియున్నట్లే మనవిషయములో కూడా ప్రణాళిక కలిగియున్నాడు.

యిర్మియా శ్రమలలోగుండా వెళ్ళినప్పుడు, ఈ తలంపు అతనిని ఎంతగా ప్రోత్సహించియుండవచ్చునో ఊహించుము: "ఇప్పుడు నేను చాలా శ్రమలనుభవించుచున్నాను. కాని నేను నాతల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎరుగును మరియు అప్పుడే ఆయన నాజీవితమునుగూర్చి ప్రణాళిక చేసెను. మరియు ఆ ప్రణాళిక నెరవేరుతుంది. దేవునికి నన్ను నేను సంపూర్ణముగా అప్పగించుకొందును". మనకు శోధనలు మరియు శ్రమలు వచ్చినప్పుడు మనముకూడా ఆవిధముగా ఆలోచించవలెను. నీవు పుట్టకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను మరియు నీజీవితములో ఆయన ప్రణాళిక నెరవేరును. కాబట్టి ఎన్నటికీ నిరాశ చెందవద్దు.

అప్పుడు యిర్మియా ఈలాగు చెప్పెను, "ప్రభువా! మాటలాడుటకు నాకు శక్తి చాలదనెను". బహిరంగముగా మాటలాడుటకు తెలియని వారిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకొనుట ఆశ్చర్యము. మోషే కూడా ఆవిధముగానే చెప్పెను. ఆయన ఈలాగు చెప్పెను, "ప్రభువా! నేను బహిరంగముగా మాటలాడలేను". మీఅందరినీ ప్రోత్సహించవలెనని కోరుచున్నాను. నీకు మాటలాడుటకు శక్తిలేనంత మాత్రమున లేక ప్రజలయెదుట మాటలాడుటకు ధైర్యములేనంతమాత్రమున, దేవుడు తనవాక్యమును ప్రకటించుటకు నిన్ను వాడుకొనడని తలవంచవద్దు. ప్రభువు మోషేతో ఈలాగుచెప్పెను, "నేను మానవుని నోటిని సృష్టించితిని కనుక నిన్ను మాటలాడునట్లు చేయలేనా?". నిన్ను విరుగగొట్టుటకును మరియు పరిశుద్ధాత్మతో నింపుటకును దేవుని నీవు అనుమతించినయెడల, ఆయన నిన్ను మాటలాడేవాడుగా చేయగలడు. ఇదంతయు దేవునితో నీవు నడిచే దానిమీద ఆధారపడి ఉండును.

నేను యౌవ్వన క్రైస్తవుడుగా ఉన్నపుడు మోమాటముగలవాడుగాను జంకెడువాడుగా ఉండెడివాడను. కాని దేవుడు తన ఆత్మతో నన్నుఅభిషేకించి మరియు నాద్వారా మాటలాడుట మొదలుపెట్టెను. నీ విషయములోకూడా ఆయన ఆవిధముగా చేయగలడు. మరొకవిషయము: దేవునితో ఎప్పుడైనను ఈలాగు చెప్పకూడదు, "ప్రభువా! నేను బాలుడను". దేవుడు నిన్ను పిలిచి మరియు ప్రతిష్టించినట్లయితే, నీ వయస్సుతో సంబంధముండదు. దేవుని సేవించుటకు, నీవు పెద్దవాడువగువరకు వేచియుండనవసరములేదు. నీ హృదయములో నీకు భారముకలిగిన వెంటనే, పరిశుద్ధాత్మతో నింపబడునట్లుగా దేవునివెదకి మరియు వెళ్ళి దేవునివాక్యమును ప్రకటింపవచ్చును.

ప్రభువు యిర్మియాతో ఈలాగు చెప్పెను, “నేను బాలుడనవద్దు. నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను. నీకాజ్ఞాపించినవన్నియు చెప్పవలెను” (యిర్మియా 1:7). దేవుడు తరచుగా తన ప్రవక్తలకు చెప్పువాక్యమును తనకు చెప్పెను : ‘భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయుందును” (యిర్మియా 1:8). నిజమైన ప్రవక్తలందరూ కలిగియున్న ప్రయోజనమేదనగా, వారందరికీ దేవుడు తోడుగా ఉండెను. గనుక వారు ఏ మనుష్యునికి భయపడలేదు. అదేవిధముగా ఈ రోజునకూడా మనము ప్రభువును సేవింపవలెను. ప్రభువు మనతో ఉండవలెను.

ప్రభువు యిర్మియా నోటిని ముట్టి యీలాగు సెలవిచ్చెను “ఇదిగో నేను నీనోట నామాటలు ఉంచియున్నాను”(9వ). యెషయాకు కూడా దేవుడు ఆవిధముగానే చేసెను. దేవుడు యిర్మియాకు ఇచ్చిన పరిచర్యను గమనించుము. ఆరుపనులు చెప్పబడినవి - పెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును (యిర్మియా 1:10). నాలుగుపనులు వ్యతిరేఖమైనవి మరియు రెండు పనులు - కట్టుటకును మరియు నాటుటకును అవి అవసరమైనవి. పాతదానంతటినీ మొదటిగా యిర్మియా పడగొట్టవలసియున్నది మరియు దానికి బదులుగా దేవునికట్టడము కట్టవలసియున్నది. అది చేయుటకు అంతసులభమయిన పనికాదు. ఒక ఖాళీస్థలములో భవనముకట్టుట చాలా సులభము. ఆదినములలో యూదాఉన్న స్థితిలోనే ఇప్పుడు క్రైస్తవ్యముకూడా ఉన్నది. దేవుని వాక్యమునకు వ్యతిరేఖమైన అనేక మతసంబంధమైన కట్టడములు ఈరోజున క్రైస్తవ్యములో ఉన్నవి. ఇటువంటి పతిస్థితిలో ఒకప్రవక్త దేవునివాక్యముతో వచ్చినయెడల మొదట అతడు పెల్లగించవలసియుండును, విరుగగొట్టవలసియుండును. నశింపజేసి మరియు పడద్రోయవలసియుండును.

నిత్యమైనవి కట్టుటకును మరియు నాటుటకును ముందుగా బుల్డోజర్ పని ప్రారంబించుటకు అనేకమంది బోధకులు సిద్ధముగాలేరు. వారు “పాతబట్టకు క్రొత్తబట్ట మాసిక” వేయుటకు కోరుదురు. కాని ప్రభువు ఈలాగు చెప్పుచున్నాడు, “కాదు. పాతబట్టను పారవేయవలెను. పాత కట్టడమంతటినీ పూర్తిగా నాశనము చేయవలెను మరియు పూర్తిగా క్రొత్తదానితో కట్టుటకు మొదలు పెట్టవలెను”. నీవాలాగున చేయని యెడల, దేవుడు కట్టవలెనని కోరుచున్నదానిని కట్టలేవు. ప్రభువు ఇంకనూ యిర్మియాను ప్రోత్సహించుచున్నాడు, “వారు నీతో యుద్దము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు” (యిర్మియా 1:19).