“ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును - వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి - నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యుదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు - నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మునుకూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి - నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను”(లూకా 23:35-41).
ఇశ్రాయేలులోని పెద్దలైన బైబిలు పండితులు మరియు యుక్తి పరులును బాగా చదువుకున్నవారైన రోమా సైనికులు ప్రభువైన యేసు ఎవరో తెలుసుకొనలేక పోవుటయు మరియు తన భూమిమీద చివరి ఘడియలలో దొంగయు హంతకుడై యుండి, బైబిలు ఏమియు తెలియని వాడు ఆయన ఎవరో తెలుసుకొనుట నిజముగా ఆశ్చర్యముగా ఉన్నది.
తెలివిని బట్టి, బైబిలు జ్ఞానమును బట్టి లేక అనుభవమును బట్టి వివేచన(వివేకము) రాదు. దానిని యదార్ధహృదయము గలవారికే దేవుడు అనుగ్రహించును. వివేచనను మనము ఏవిధముగా కలిగియుండగలమో సిలువ మీద దొంగ మనకు బోధిస్తున్నాడు.
ఇశ్రాయేలులో ఉన్న బిషప్పులందరు, యాజకులు మరియు శాస్త్రులందరు ఆ దినమున సిలువచెంత ఉండి ప్రభువైన యేసును అపహసించిరి (మత్తయి 27:41). ఆ మార్గమున వెళ్ళుచున్న ఆ దేశములోని పెద్దలు ఆయనను అపహసిస్తూ మరియు దూషిస్తూ దేవాలయమును ఆయన పడగొట్టుననిరి (ప్రభువైన యేసు ఎన్నడూ ఆవిధముగా అనలేదు కాని వారు తప్పుడు నిందను మోపిరి) (మత్తయి 27:39).
ఈ దూషణలన్నిటి విషయములో దొంగలిద్దరు ఒప్పించబడి, వారు యేసుకు వ్యతిరేఖముగా మాట్లాడిరి (మత్తయి 27:44). కాని అకస్మాత్తుగా ఒక దొంగ ఆగి, ప్రభువైన యేసును గూర్చి ఇట్లనెను “యీయన ఏ తప్పిదమును చేయలేదు” (లూకా 23:41).
అది అతనికి ఏవిధముగా తెలిసినది? ప్రభువైన యేసు తన గురించి చెప్పినట్లు, ఆయనే మెస్సయ్య అని ఎలాగు గుర్తించగలిగాడు? ప్రభువైన యేసు పక్షముగా ఎవరూ లేనప్పుడు, వేరే వారి నిందలన్నియు అసత్యములని అతడు ఏలాగు నిరాకరించాడు?
“నిప్పు లేకుండా పొగ రాదు కదా!” వస్తుందా? లోక జ్ఞానమును బట్టి ఈ సామెత ప్రకారము, వందలమంది ప్రజలు ఈవిధముగా నిందించుటకు కారణము ప్రభువైన యేసులో నిజముగానే ఏదైనా ఉండవచ్చునని ఆ దొంగ అనుకొని యుండవచ్చును.
అయినప్పటికీ ప్రభువైన యేసులో ఏ తప్పిదము లేదని ఆ దొంగ చెప్పాడు. “తాను వినిన దానిని” (యెషయా 11:3)నిరాకరించునంతగా ఆత్మానుసారమైన మనస్సుగల వ్యక్తిగా ఆ దొంగ ఏవిధముగా మార్పు చెందాడు? ఎందుకనగా “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” (లూకా 23:34) ప్రభువైన యేసు చెప్పుటను అతడు విన్నాడు.
ఒక ప్రక్క ఆ బైబిలు పండితులలో ఉన్న సమాధానము, కలవరము, ద్వేషము మరియు పగను అతడు చూచియున్నాడు. మరొక ప్రక్కన ప్రభువైన యేసులో ఉన్న క్షమించే ఆత్మను, తన్ను తాను సమర్దించుకోకపోవడము మరియు విశ్రాంతిని చూచియున్నాడు. ఆవిధముగా ఎవరిది న్యాయమో మరియు ఎవరిది అన్యాయమో అతడు వివేచించగలిగియున్నాడు.
సంఘములో కూడా మనము ఈవిధముగా వివేచించవలెను. ఇద్దరు సహోదరులు లేక సహోదరీలు వ్యాజ్యమాడినప్పుడు, ఎవరిది న్యాయమో లేక ఎవరిది అన్యాయమో వెంటనే ఆ దొంగవలె వివేచించగలగాలి.
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటి వారు అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు (యెషయా 57:20,21).
దేవుని దృష్టిలో అన్యాయస్తులుగా ఉన్నవారు, వారి జీవితములలో ఎల్లప్పుడు కలవరము మరియు అసమాధానము(అశాంతి) కలిగియుండి, చెత్తను మరియు బురదను ఎగురవేసినట్లు వారి నోటితో భక్తిగల సహోదర సహోదరీలకు వ్యతిరేఖముగా చాడీలు చెప్పడము మరియు దూషించుట చేయుదురు.
అటువంటి సహోదరుని లేక సహోదరిని నీవు కలిసినప్పుడు, దేవుడు వారిని దుష్టులని పిలచుచున్నాడు (యెషయా 57:20,21)గనుక నీవు కూడా వారిని అలాగే ఎంచవలెను. నీవు ఆ సంగతులను వివరముగా తెలుసుకొననవసరము లేదు మరియు ఇంకా ఎక్కువగా ఋజువు కూడా అవసరము లేదు. ఆ వ్యక్తిలో ఉన్న అశాంతి మరియు కలవరమే స్పష్టమైన ఋజువు.
లోకములోని కోర్టులలో, న్యాయమూర్తులు ఋజువులను గాలించి, తీర్పు చెప్పుటకు అనేక సంవత్సరములు తీసుకొందురు. అయినప్పటికీ, వారు తప్పు చేయవచ్చును. సంఘములోని వివాదములకు ఈ పద్దతిని తీసుకొన్నట్లయితే ఇరువైపులా విని ఒక నిర్ణయమునకు వచ్చుటకు మన జీవితకాలమంతయు గడపవలసియుండును. అయినప్పటికీ మనము తప్పుచేయవచ్చును.
మరి శ్రేష్టమైన మార్గమును దేవుడు మనకిచ్చాడు. ఎవరు విశ్రాంతిలో ఉన్నారు మరియు ఎవరు అవిశ్రాంతిలో ఉన్నారు, ఎవరు తమను తాము సమర్ధించుకొనుటకు నిరాకరించుచున్నారు మరియు ఎవరు ఫిర్యాదులతో నింపబడియున్నారు. అప్పుడు ఎవరు నీతిమంతులో లేక ఎవరు కాదో వెంటనే నీకు జవాబు దొరుకును.
సిలువ మీద దొంగ మనకు వివేచన యొక్క రహస్యమును చూపించాడు.