హెబ్రీ 2:17లో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధానయాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను అని వ్రాయబడియున్నది. మనము ఎదుర్కొనే ప్రతిశోధనను ప్రభువైనయేసు ఎదుర్కొనియున్నారు. మనము శోధించబడినప్పుడు ఈ విషయము మనకు ఎంతో ప్రోత్సహముగా ఉంటుంది అనగా దేవుని జీవముతో నింపబడి మనము కూడా జయము పొందగలము. క్రీస్తు మన కొరకు రక్తమాంసములు ధరించుకొని శరీరధారియై, మన వంటివాడై వచ్చియున్నాడనే అద్భుతమైన సత్యాన్ని మనము గ్రహించకుండునట్లు సాతాను ప్రయత్నిస్తాడు.
వ్యాపారస్థులందరు ఎదుర్కొనే శోధనలు నజరేతులో వడ్రంగిగా ప్రభువైన యేసు ఎదుర్కొనియున్నారు. ఆయన ఎవరిని మోసగించలేదు. ఏ వస్తువుకైనను ఆయన ఒక్కసారి కూడా ఎక్కువ రేటు చెప్పలేదు. నష్టము వచ్చినప్పటికైనను నీతి విషయములో ఆయన రాజీపడలేదు. నజరేతులో వేరే వడ్రంగివాళ్ళతో ఆయన పోటీపడలేదు. తన అవసరము తీర్చబడుటకు ఆయన పనిచేసియున్నాడు. వడ్రంగి పని చేయుటకు అవసరమైన వాటిని కొను విషయములో మరియు అమ్ము విషయములోను, ధనము విషయములో మన వలెనే శోధించబడియున్నారు. ఆయన సంపూర్ణముగా జయించారు. ప్రభువైనయేసు పరిపూర్ణులుకాని తల్లిదండ్రులకు అనేక సం||లు లోబడి జీవించారు. ఈ విషయములో ఆయన అనేకమైన అంతరంగమైన శోధనలు వచ్చియుండును. అయినప్పటికినీ ఆయన ఒక్క పాపము కూడా చేయలేదు. యోసేపు మరియు మరియ ఇంకను పాతనిబంధనలోనే ఉన్నారు. కాబట్టి వారికి నిశ్చయముగా పాపము మీద జయము లేదు. జయములేని అనేక భార్యాభర్తల వలే వారు కొన్నిసార్లు పెద్దగా అరచి, వివాదాలు పెట్టుకొనియుండవచ్చును. మరొకవైపు ప్రభువైనయేసు సంపూర్ణజయముతో జీవించారు. అయినప్పటికినీ ఆయన వారినెప్పుడైనను తృణీకరించలేదు. ఆవిధముగా చేసినట్లయితే, ఆయన పాపము చేసి యుండెడివాడు. ఆయన వారికంటే ఎంతో పవిత్రుడైనప్పటికినీ వారిని గౌరవించారు. అక్కడ ఆయన దీనత్వములో ఉన్న సౌందర్యాన్ని చూస్తాము. మన రక్షణ అంతటికీ కర్తయైన ప్రభువైనయేసుకు, మనకు వచ్చే ప్రతివిధమైన శోధనను ఆ ముపై సం||లలో తండ్రియైన దేవుడు అనుమతించాడు. ఆయన మనకు రక్షకుడును మరియు గొప్ప ప్రధానయాజకుడును అగుటకు ముందుగా వాటిని అనుమతించియున్నాడు.
"ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకలైన కుమారులను మహిమకుతెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును" (హెబ్రీ 2:10).
చివరి 3 1/2 సం||లలో కూడా దేశమును బట్టి మరియు పేరుప్రతిష్టల గురించి మొదలగు వాటిని బట్టి కూడా ప్రభువైనయేసు శోధించబడియుంటారు. సాధారణముగా మనకు ఇంటిలోను మరియు ఆఫీసులో వచ్చే శోధనలన్నిటినీ ఆయన మొదటి 30సం||లలో జయించారు. బాప్తిస్మము తీసుకున్న సమయములో తండ్రి ప్రభువైనయేసును అంగీకరించారు.
దేవుడు దేనిని బట్టి మనలను అంగీకరిస్తారనే విషయమును చూచుటకు మన కళ్ళు తెరువబడితే మన జీవితములలో గొప్ప మార్పు వస్తుంది. ప్రపంచవ్యాప్తమైన పరిచర్యను కాదుగాని మనజీవితములలో శోధనలు వచ్చినప్పుడు నమ్మకముగా ఉంటాము. మనము బాహ్యమైన అద్భుతములను బట్టిగాక జీవితములో రూపాంతరము పొందుటను బట్టి సంతోషిస్తాము.
ప్రభువైన యేసువలే "తండ్రి ఆజ్ఞకు అవిధేయత చూపించుట కంటే చనిపోవుట మేలు" అను వైఖరికలిగియుండువారికి దేవుని యొక్క అతిశ్రేష్టమైన బహుమానములు మరియు మెప్పును, ఘనతను పొందెదమను విషయము ఎంతో మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. ఫిలిప్పీ 2:5-8లో ఈ విషయమే చెప్పబడింది. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా, విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. మనకు ఒక్క వరము కూడా లేకపోయినప్పటికీ, ఏపరిచర్య ఉన్నను మరియు పురుషులమైనను లేక స్త్రీలుమైనను జయించువారిగా పిలువబడి, ఏర్పరచబడి, నమ్మకముగా ఉండి జయించువారుగా ఉండుటకు మనందరికి సమాన అవకాశమున్నది.