వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

మత్తయి 4:1-11లో ప్రభువైనయేసు యొక్క శోధన గూర్చి చదువుతాము. ప్రభువైనయేసు, "సమస్త విషయములలో మనవలెనే శోధింపబడినను, ఆయన పాపములేని వాడుగా ఉండెనని" హెబ్రీ 4:15లో బైబిలులో చెప్పుచున్నది. కొందరు"తెలివైన" క్రైస్తవులు ఈ విషయాన్ని పరిశోధించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు,"ఆయన పాపము చేయగలడా లేక ఆయనకు పాపము చేయుట అసాధ్యమా?" కొందరు "ఆయన పాపము చెయ్యలేడని, మరికొందరు ఆయన పాపము చేయుట అసాధ్యమని" అనుచున్నారు. కాని దాని గురించి మనం ఎప్పుడైనను తర్కించకూడదు. సాధారణ మనిషియొక్క మానసికస్థితిని పరిశోధించుటే చాలా కష్టం. కావున ప్రభువైనయేసుయొక్క మానసికస్థితిని ఏవిధంగా పరిశోధించగలం? ఆయన మన వలెనే శోధించబడి, పాపము చేయలేదని తెలుసుకుంటే చాలును. మనకు ఆయన మాదిరిగా ఉన్నాడు. ఆయన దేవుడని మనకు తెలియును మరియు ఆయన మానవుడుగా భూమిమీదకు వచ్చినప్పుడు దేవునిగా ఆయన శక్తి సామర్ధ్యాలను వినియోగించలేదు. దేవుడు శోధించబడడు. బైబిలు చెప్పుచున్న ప్రకారము ఆయన మన వలెనే శోధించబడి పాపము చెయ్యలేదని నేను నమ్ముచున్నాను. నేను కూడా ఆయనవలే జయించగలనను విషయమే నాకు విశ్వాసాన్ని ఇస్తుంది(ప్రకటన 3:21).

40 రోజులు ప్రభువైనయేసు అపవాదిచేత శోధింపబడ్డాడు(లూకా 4:2). ఆ 40రోజులు ప్రభువు అపవాదిని ఎదిరించాడు. మనమిక్కడ చదివేది చివరి మూడు శోధనలు మాత్రమే. "వ్రాయబడియున్నది" అనే ఆత్మఖడ్గముతో ప్రభువైనయేసు శోధన జయించారు. ఆయన వాక్యాన్ని చెప్పుచున్నాడని అపవాది చూచినప్పుడు, అపవాది కూడా లేఖనములలో నుండి, "నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము- ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను"(మత్తయి 4:6). అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను" (మత్తయి 4:7). సత్యమంతయు ఒక్క వచనములో ఉండదు. కాని లేఖనాలన్నిటిలో కలిపి ఉంటుంది. ఒక వచనము మరొక వచనముతో సమతుల్యం చేయబడుతుంది. ప్రభువును పాపము చేయుటకు ప్రేరేపించుటకు అపవాది ఒక లేఖనాన్ని చెప్పినట్లయితే, నీవు కూడా తప్పిపోవునట్లు నీకును లేఖనాలను చూపిస్తాడు. నీకు లేఖనము తెలియనట్లయితే, నీవు తప్పిపోయే ప్రమాదమున్నది. ప్రభువుకు వచ్చిన శోధనలు మనము చూచుట మంచిది ఎందుకనగా సాతాను మనలను కూడా అలాగే శోధిస్తాడు.

1. స్వార్ధము(మత్తయి 4:1-4). నీ ఆకలి తీర్చుకొనుటకు రాళ్ళను రొట్టలుగా మార్చుము.

a). ఆత్మీయ అవసరాల కంటే శారీరక అవసరాలకు మొదటిస్థానమిచ్చుట. ప్రభువైన యేసు ఇట్లన్నారు, మనుష్యుడు కేవలం రొట్ట వలన మాత్రమే కాదుగాని దేవుని నోటిలో నుండి వచ్చిన ప్రతిమాట వలన జీవిస్తాడు.

b). దేవుని శక్తిని, ప్రభావాన్ని కేవలం వ్యక్తిగత అవసరాలకే వాడుట. ప్రభువు ఆ విధంగా చేయుటకు నిరాకరించారు. 5000 మందికి ఆహారాన్ని పంచిపెట్టుటకు ప్రభువు దేవుని శక్తిని వినియోగించారు గాని కేవలం తన కొరకేకాదు. కేవలం వారికొరకే డబ్బు సంపాదించుకొనే శోధనలో అనేక బోధకులు పడిపోయారు.

2. గర్వముతో ఉహించుకొనుట(మత్తయి 4:5-7). దేవాలయ శిఖరము నుండి దూకి, దేవుని వాగ్ధానాన్ని స్వతంత్రించుకొనుట.

a). దేవుడు చెప్పని దానిని చేసి, దేవుని వాగ్ధానాలను స్వతంత్రించుకొనుట. ఇలాంటి క్రియలు చేసి దేవుని శోధించకూడదని ప్రభువు చెప్పారు. కొందరు బుద్ధిలేని క్రైస్తవులు వారికి జబ్బు చేసినప్పుడు, మందులు వాడకుండా దేవుడే వారిని స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తారు. ఇది విశ్వాసము కాదు కేవలం ఊహ మాత్రమే. ఇది ఆత్మహత్యలాంటిది. మందులు(టాబ్లెట్స్), మెడిసిన్స్ దేవుడు చేసిన సృష్టిలో నుండి తయారు చేయబడ్డాయి. కాబట్టి మనం వాటిని వాడాలి. మిద్దెమీద నుండి దిగుటకు మెట్లు ఉన్నట్లయితే, మెట్లను ఉపయోగించాలి గాని పై నుండి దూకకూడదు. మనం దూకినట్లయితే, దేవుడు మనలను కాపాడడు. మనమెక్కడో మందులు దొరకని అడవిలో ఉన్నట్లయితే, మనం దేవుని అడుగవచ్చును మరియు దేవుడు స్వస్థపరుస్తాడు. అంతే గాని దేవుడు మనకు మెడిసిన్స్ అందుబాటులో ఉంచినప్పుడు కాదు.

b). నీవు దైవజనుడవని గొప్ప పేరు తెచ్చుకొనుటకు గొప్పకార్యాలను చేయాలనుకోవడం అనగా మనుష్యులమెప్పును కోరుట. మనుష్యుల మెప్పు కొరకు అద్భుతమైన గొప్ప కార్యాలను చేయుటకు ప్రభువు నిరాకరించారు.

3. సర్ధుబాటు చేయుట (మత్తయి 4:8-10). సాతానుకు నమస్కారము చేయుట ద్వారా లోకరాజ్యాలను మరియు వాటి మహిమను పొందుట.

a). మనం మంచి దానిని సరియైన మార్గములో పొందాలి. దుర్నీతితో కాదు. ఒక దుర్నీతి కార్యము సాతానుకు నమస్కారం చేసినట్లే అవుతుంది. ప్రభువు సిలువమార్గాన్ని ఎంచుకున్నారుగాని సుళువైన మార్గంకాదు.

b). ఈ లోకమహిమను వెదకుట:- ధనము, ఘనత, స్థానము మరియు లోకములోగాని, సంఘములోగాని అధికారాన్ని కోరుట. దేవుడు మాత్రమే ఆరాధించబడాలి గాని సాతానును గాని, డబ్బునుగాని మరిదేనిని ఆరాధించకూడదు. కొందరు బోధకులు వారి పరిచర్య విస్తరించుటకు దేవుడు చెప్పమన్న వాటిని కొన్ని చెప్పకుండా మౌనంగా ఉంటారు మరియు అందరినీ సంతోషపెడతారు. వారి పరిచర్య విస్తరించిందిగాని వారు సాతానుకు నమస్కారం చేస్తారు.

ప్రభువైనయేసు యొద్దకు వచ్చినట్లే అపవాది మన యొద్దకు వస్తాడు. దేవుని వాక్యముతో ఆయన అపవాదిని వెళ్ళగొట్టాడు. మనంకూడా దేవునివాక్యముతో వెళ్ళగొట్టాలి.