వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము తెలిసికొనుట
WFTW Body: 

క్రీస్తును పరిపూర్ణుడుగా లోకానికి చూపించుటకు దేవుడు మనలో వేరే వేరే గుణలక్షణాలను(స్వభావము) గలవారిని మరియు వరములను గలవారిని వాడుచున్నాడు. ఇతరులతో ఒక్కటవకుండా మనంతటమనమే క్రీస్తును సరిగా బయలుపరచలేము మరియు పరిపూర్ణముగా వ్యక్తపరచలేము. ఎక్కడైనా ఒక్కరే పరిచర్య చేసినట్లయితే సమతుల్యతలేని క్రైస్తవులు తయారవుతారు. క్రీస్తు శరీరమైన సంఘములో వేరే వేరే సత్యాలను అతి ముఖ్యముగా విశేషించి చెప్పేవారున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమై యుండాలి. ఉదాహరణకు ఇద్దరు సహోదరులలో ఒకరు ఒక సంఘములో విషేశించి “పరిశుద్ధాత్మతో నింపబడియున్నామని సంపూర్ణ నిశ్చయత కలిగి, ఒకవేళ మిమ్ములను మీరు మోసం చేసుకొనెదరేమో” అని చెప్పి యున్నారు. మరొక సహోదరుడు అదే సంఘములో “మీరు పరిశుద్ధాత్మతో నింపబడియున్నారని సంపూర్ణ నిశ్చయత కలిగియుండుడి” అని చెప్పియున్నాడు. ఇవి రెండు పైకి విరుద్ధముగా కనబడుచున్నవి. క్రీస్తు శరీరముగా సంఘము సంపూర్ణమగుటకు పైకి వ్యతిరేకముగా కనబడే రెండు రకాల పరిచర్యలు అవసరమే. క్రీస్తు శరీరములో ఒకసారి రక్షణ పొందితే ఎన్నటెన్నటికీ, నిత్యత్వానికి రక్షణ పోగొట్టుకొనమను సత్యము మరియు రక్షణ పోగొట్టుకొనే అవకాశము కూడా ఉన్నదనే సత్యము అను రెండు ఉన్నవి. ఈ రెండు సత్యములు బైబులులో ఉన్నవి. చార్లెస్ సైమన్ చెప్పినట్లు “సత్యము మధ్యలో లేదు మరియు అంచునకూడా లేదు కాని రెండిటిలో ఉన్నది”. కాబట్టి ఈ రెండు సత్యములను బోధించేవారు మనకు అవసరము.

అలాగే కొందరు ముందుకు దూసుకుపోయేవారుంటారు మరియు మొహమాటంతో ఉండేవారుంటారు. ఈవిధంగా సంపూర్ణంగా ఉంటాము. కొందరు అతిజాగ్రత్తపరులై ఒక అడుగు ముందుకు వేయవలెనా లేక ఇంకను కనిపెట్టవలెనా అని ఎంతోకాలము కనిపెట్టేవారుంటారు. కొందరు వారు చేయబోయేవాటి పరిణామాలగూర్చి ఎక్కువగా ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. సమతుల్యత ఉంటుంది కాబట్టి ఈ రెండురకాల(ఇతర) వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. కొందరు లోతుగా ఆలోచన చేసి చాలా నెమ్మదిగా అభివృద్ది పొందుతారు. కాని క్రీస్తు శరీరమైన సంఘములో అందరు అటువంటివారే ఉన్నట్లయితే, దేవుని చిత్తమంతయూ నెరవేర్చలేకపోవచ్చును.

ప్రతి గుణలక్షణములో కూడా బలముంటుంది మరియు బలహీనత కూడా ఉంటుంది. ఎంతో భిన్నాభిప్రాయాలు కలిగిన క్రైస్తవులు పరిశుద్ధాత్మద్వారా ఒక్కటై పని చేసినప్పుడు క్రీస్తును సంపూర్ణముగాను మరియు పూర్తిగాను లోకానికి బయలుపరచగలం. కాబట్టి క్రీస్తు శరీరంలో అందరిని మనవంటివారివలె చేయుటకు ప్రయత్నించి మన సమయాన్ని వృధాచేసుకొనకూడదు. కాబట్టి ఎవరికివారై ఉండి క్రీస్తులో వృద్ధి పొందుటకు వారిని అనుమతించాలి. ఇతరుల బలహీనతలలో వారిని మనం ఎలా బలపరచగలమనేదానిమీద మనం దృష్టి పెట్టాలి. మన బలహీనతలో వారు మనలను బలపరుస్తారు.

పేతురు మరియు యోహాను ఒంటరిగా చేయుటకంటే ఇద్దరు(వేరైన గుణలక్షణం, స్వభావం కలవారు) కలసి పనిచేయుటద్వారా దేవునికి ఎక్కువ మహిమ తెచ్చారు. అలాగే పౌలు, తిమోతీలు కూడా కలిసి పనిచేసి, శక్తివంతమైన జంటగా ఉన్నారు.

సంఘములో చాలా తెలివైనవారు ఉంటారు మరియు సామాన్యమైన వారు ఉంటారు. సహజంగా వారు దేవుని సత్యాన్ని బయలుపరచే విధానం వేరుగా ఉంటుంది. తెలివైనవారు, సామాన్యులు, వేదాంతులు, ఇంటిలో ఉండే భార్యలు, చదువుకునే విద్యార్ధులు, వ్యవసాయదారులు మొదలగువారు ఉన్నలోకానికి సువార్తను ప్రకటించుటకు రెండు రకాలవారు అవసరమే కనుక క్రీస్తు శరీరములో మనమెవరినీ తృణీకరించకూడదు లేక విమర్శించకూడదు. పౌలులాంటి పండితుడు మరియు పేతురులాంటి పామరుడు ఇద్దరూ దేవునికి అవసరమే. ఒకే శుభవార్తను వారు ఇద్దరు వేరే విధంగా బోధించారు. ఎందుకనగా ఆవిధముగా బోధించుట అవసరము. దేవుడు ఒకరిద్వారా చేసిన పనిని ఇంకొకరిద్వారా చేయలేకపోవచ్చును.

ఒక మనుష్యుడు క్రొత్తగా జన్మించినప్పుడు అతని తెలివితేటలు మారవు లేక అతని సామాజిక స్థితిని మార్చుకొనమనికూడా కోరదు. క్రీస్తులో ఉన్నవారిలో కొంత సామాజిక తేడాలు ఉన్నప్పటికీ, భూమిమీద నానావిధములుగా ఉండే స్థితిని సువార్త మార్చదు. ఫిలేమోనులాంటి ధనవంతుడు, అలాగే ఒనేసిములాంటి దాసుడు కూడా అతనికి అవసరం. వారి సామాజిక స్థితి మరియు జీవిత విధానం మారనప్పటికీ క్రీస్తు శరీరంగా వృద్ధి పొందుటకు ఇతరులు చేయలేని పనిని ప్రతి ఒక్కరు చేయాలి. ఆవిధంగా కలసి సువార్త పని చేయాలి.

కంపెనీలో తయారయ్యే మోటరు సైకిలులాగ క్రీస్తుశరీరంలో అందరినీ ఒకేలాగ చేయుట దేవుని ఉద్దేశ్యం కాదు. నానా రకములుగా ఉన్న వివిధ అవయవాలతో క్రీస్తుశరీరం వృద్ధి పొందుతుంది. అందరూ ఒకేలాగ ఉంటే అక్కడ మరణం ఉంటుంది. మనం సహవాసంలో లోతుగా ఎదిగి, ఆత్మీయంగా పరిణితి చెందుటకు మనలో ఉన్న భేదాభిప్రాయాలను దేవుడు ఉపయోగిస్తాడు. సామెతలు 27:17 లో ఇనుము ఇనుమును తాకినప్పుడు ఇనుపకణములు ఎగిరి ఇనుము పదునైనట్లు మనం మాట్లాడుకొనునప్పుడు కణములు వచ్చి మనం కూడా పదును చెయ్యబడతాము.

వేరు వేరు స్వభావం గల ఇద్దరు కలసి తనపని చేయునట్లు చేసి, దేవుడు వారిని ఆత్మీయంగా పదును చెయ్యవచ్చును. ఒక వ్యక్తి ఇనుములాగా ఉండి, ఇంకొకరు మట్టిలాగా ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఎటువంటి “కణములు” రావు కాబట్టి వారు పదును చెయ్యబడటం ఉండదు. దాని బదులుగా మట్టిమీద ఇనుముయొక్క ముద్ర పడుతుంది అనగా ఒక బలవంతుడైన వ్యక్తి అభిప్రాయం బలహీనమైన వ్యక్తిమీద వత్తిడి చేయబడుతుంది. ఒకరి అభిప్రాయం మరొకరిమీద రుద్దబడుట దేవుని ఉద్దేశ్యంకాదు కాని ఒకరినుండి ఒకరు ఇద్దరు నేర్చుకోవాలి. మనం ఇతరులతో విభేదించవచ్చు అయినప్పటికీ మనం ఒక్కటైయుండి ఒకరినొకరు ప్రేమిస్తూ నిజానికి మరి ఎక్కువగా ఇతరులను ప్రేమిస్తాం.