వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము
WFTW Body: 

1. అపవిత్రత: మన కళ్ళద్వారాను మరియు చెవులద్వారాను ముఖ్యంగా అపవిత్రత మన హృదయములో ప్రవేశిస్తుంది. అపవిత్రత మన హృదయములోనుండి బయటకువచ్చి ముఖ్యంగా మన నాలుకలద్వారాను మరియు కళ్ళద్వారా వ్యక్తపరచబడుతుంది. పవిత్రతను కోరేవారు ప్రత్యేకముగా వారు చూచేవాటి విషయం మరియు వినేవాటి విషయం జాగ్రత్తపడాలి. నీ కుడికన్నుతోగాని లేక నీకుడిచెయ్యితోగాని పాపము చేయుటకంటే వాటిని పెరికి పారవేయుమని ప్రభువు తన శిష్యులతో చెప్పారు (మత్తయి 5:27-29).

నీ కుడిచెయ్యిని తీసివేయాలనిగాని లేక నీ కన్నును పెరికివేయాలనిగాని డాక్టరు ఎప్పుడు చెబుతాడు? ఎప్పుడనగా ఆ అవయవాలు తీసివేయనట్లయితే, శరీరమంతయు పాడైపోయి చనిపోతుంది. పాపము విషయంలో కూడా మనం అలాగా అర్ధం చేసుకోవాలి. పాపం ఎంత తీవ్రమయిందంటే మన శరీరాన్ని నాశనం చేస్తుంది. చాలామంది విశ్వాసులు దీనిని గ్రహించనందున వారు మాట్లాడువిషయంలోను మరియు చూచేవిషయంలోను అజాగ్రత్తగా ఉంటారు. మనం కళ్ళతోగాని లేక నాలుకతోగాని పాపం చెయ్యాలని శోధించబడినప్పుడు మనం గ్రుడ్డివారముగాను మరియు మూగవారముగాను ఉండాలి.

2. అవిశ్వాసము: విశ్వాసములేని హృదయము దుష్టహృదయమని బైబిలు చెప్పుచున్నది (హెబ్రీ 3:12). వారి అవిశ్వాసాన్నిబట్టి శిష్యులను ప్రభువైన యేసు ఏడుసార్లు గద్దించారు (మత్తయి 6:30, 8:26, 14:31, 16:8, 17:17-20, మార్కు 16:14, లూకా 24:25).మరి ఏయితర విషయంలోను ఆయన ఒక్కసారికూడా తన శిష్యులను గద్దించినట్లు చూడము. అవిశ్వాసము దేవునిని అవమానించుటయే. ఎందుకనగా భూమిమీద చెడ్డవారైన తండ్రులే వారి బిడ్డలకు అన్ని సదుపాయములు కలిగించుచుండగా, దేవుడు తన బిడ్డల విషయంలో శ్రద్ధ వహించుటలేదనియు మరియు వారి అవసరములు తీర్చుటలేదనియు చెప్పినట్లుండును. ఈ రోజులలో దేవునినుండి అనేకవిషయాలు పొందుకొనుటకు నకిలీ విశ్వాసముకూడా ప్రకటించబడుచున్నది. కాని ప్రభువైన యేసు అటువంటి విశ్వాసాన్ని ప్రకటించలేదు. ప్రతిరోజు మనం సజీవమైన విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రభువు కోరుచున్నాడు. మన తండ్రియైన దేవుడు తన వాక్యములో మనకు అనుగ్రహించిన అమూల్యములును, అత్యధికములులైన వాగ్దానములయందును, మనలను ప్రేమించుచున్న పరలోకమందున్న మన తండ్రిని విశ్వసించుటద్వారా మనం నిరాశ, దిగులు, చింతను జయించగలము. ఒకసారి విశ్వాసాన్నిచూచి మరియొకసారి అవిశ్వాసాన్ని చూచి ప్రభువు ఆశ్చర్యపడ్డారు (మత్తయి 8:10, మార్కు 6:6).

ప్రజలలో విశ్వాసాన్ని చూచినప్పుడు ప్రభువు ఎంతో సంతోషించారు. మరియు మనలను ప్రేమించే మన పరలోకతండ్రిని విశ్వసించుటకు ఇష్టపడనివారిని చూచి ఆయన నిరుత్సాహపడ్డారు.

3. ఆత్మీయగర్వము: పరిశుద్ధతను వెదికేవారిలో ఎక్కువగా ఆత్మీయగర్వమనే పాపము ఉంటుంది. ఇతరులను తృణీకరించి, ప్రార్ధించే స్వనీతిపరుడైన పరిసయ్యునిగూర్చి మనందరికీ తెలుసు (లూకా 18:9-14). బహిరంగంగా చేసే ప్రార్ధనలలో సుమారుగా 90% ప్రార్ధనలు దేవునికిగాక మనుష్యుల మెప్పుకొరకు చేసేవిగా ఉన్నట్లు కనబడుచున్నది. ఉపవాసములో ఉన్న పరిసయ్యునికి ఇతర పాపులవలె బాహ్యమైన పాపములు లేకపోవచ్చును. కాని అతని ఆత్మీయ క్రియలనుబట్టియు మరియు గర్వముతో అతడు ఇతరులను తృణీకరించినదానినిబట్టియు ప్రభువు అతనిని ద్వేషించారు. ఆత్మీయగర్వమే విశ్వాసులు ఎల్లప్పుడు ఇతరులను తీర్పు తీర్చేటట్లు చేస్తుంది.

పాపులలోనే ప్రధాన పాపినని తనగురించితాను తెలుసుకొని అంగీకరించిన సుంకరి దేవునిచేత అంగీకరించబడ్డాడు. దేవునిని ముఖాముఖిగా చూచినవారు ఏదొక సమయంలో వారు పాపులలో ప్రధానులని తమ్మునుతాము చూచుకోగలుగుతారు.

అత్యంత దీనుడైనవాడు పరలోకంలో అత్యంత గొప్పవాడని ప్రభువైన యేసు బోధించారు (మత్తయి 18:4). దీనత్వమే పరలోకంలో గొప్ప గుణ లక్షణము. ప్రభువే ప్రతి కిరీటానికి అర్హుడని తమ కిరీటములను సింహాసనము యెదుట పడవేసిరని ప్రకటన గ్రంధంలో మనం చూస్తాము (ప్రకటన 4:10,11).

దేవుడు ఆజ్ఞాపించినవన్నియు మనం చేసినప్పటికీ, మనం చేయవలసినవి మాత్రమే చేసిన నిష్ప్రయోజకులమైన దాసులమని ప్రభువైన యేసుచెప్పారు (లూకా 17:10). మరి మాటిమాటికీ పడిపోవుచున్న మన పరిస్థితి ఏమిటి?