వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము శిష్యులు
WFTW Body: 

1 యోహాను 2:12-14 లో క్రైస్తవజీవితములో ఉన్న మూడు మెట్లు అనగా ఆత్మీయ పసిబిడ్డలు, ఆత్మీయ యవ్వనస్థులు మరియు ఆత్మీయంగా వృద్ధినిపొంది పరిణితిచెందిన వారి గురించి యోహాను చెప్పుచున్నాడు.

కేవలము పాపక్షమాపణపొంది, క్రొత్తగా జన్మించి మరియు దేవునిని తమ తండ్రిగా ఎరిగినవారు ఆత్మీయంగా పసిబిడ్డలైయున్నారు. క్రీస్తులో ఉన్న పసిబిడ్డలందరు ఈ రెండు అనుభవాలు కలిగియుండాలి. ఇది క్రైస్తవజీవితానికి పునాది మరియు ఆరంభమైయున్నది. ఈ పునాది నీకు లేనట్లయితే, నీవు ఆత్మీయముగా ఎదుగలేవు(వృద్ధిని పొందలేవు). తరువాత నీవు క్రీస్తులో బలవంతుడవైయుండి మరియు నీవు సాతానును జయించునట్లు, దేవుని వాక్యము ఎల్లప్పుడు నీ హృదయములో నిలిచియుండునట్లు వాక్యమును ద్యానించుట నేర్చుకోవాలి (2:13,14). తరువాత మనము ఆత్మీయముగా దేవుడు కలుగజేసే వృద్ధిని పొందుచూ ఇతరులకు ఆత్మీయ తండ్రులగునట్లు ఎదగాలి. దేవునిని తండ్రిగా కలిగియుండి, ఎరిగియుండుట మాత్రమేగాక దేవునిని మరియు ఆయన మార్గములను అనుభవపూర్వకముగా అంతకంతకు ఎరుగుతూ ఉండాలి. నీవు ఆత్మీయవృద్ధిని పొంది పరిణితి చెందినప్పుడు నీవు దేవునిని, ఆయన విలువలను, నియమాలను మరియు ఆయన పనిచేసే విధానము మొదలగువాటిని వ్యక్తిగతముగాను అనుభవపూర్వకముగాను ఎరిగి ఉంటావు. అటువంటి తండ్రులు ఇతర విశ్వాసులను నడిపిస్తారు. ఇది మన సంఘములలో ఎంతో అవసరమైయున్నది.

ఎవరైతే పాపక్షమాపణను, క్రొత్తగా జన్మించుటను మరియు దేవుడు వారికి మంచి తండ్రిగా ఉండి వారి భూసంబంధమైన అవసరాలను తీరుస్తూ, రోగములను స్వస్థపరుస్తూ ఉంటాడని ఎల్లప్పుడు మాట్లాడుచూ ఉంటారో వారు ఆత్మీయంగా పసిబిడ్డలు. వారు పసిబిడ్డలవలె ఎల్లప్పుడు “అమ్మా, నాన్న” అని పిలిచేవారుగా ఉంటారు. మనమందరము ఇక్కడనే ఆరంభిస్తాము అయితే మనం అదే స్థితిలో ఉండకూడదు. మనం వృద్ధిపొంది, ఎదిగి మరియు సాతానుతో పోరాడుట నేర్చుకోవాలి తరువాత కూడా ఇంకను ఎదుగుతూ ఉండాలి. దేవునిని మన సర్వములో సర్వముగా అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. ఇది అన్నిటికంటే ఎంతో ముఖ్యమైయున్నది. అప్పుడు “తండ్రులముగా” సంఘములో అనేకులకు ఆశీర్వాదముగా ఉంటాము.

ఆత్మీయముగా అనేకస్థితులలో ఉన్న విశ్వాసులను యోహాను హెచ్చరించుచున్నాడు “లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి” (2:15) . ఆత్మీయతండ్రులకు కూడా లోకమును ప్రేమించకుడి అనే హెచ్చరిక అవసరమా? అవును అవసరమే. లోకములో అందరికంటే ఎక్కువగా పరిణితి చెందినవారుకూడా ఎప్పుడైనా లోకమును ప్రేమించే అపాయములో ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఈ హెచ్చరిక అవసరము “లోకమును ప్రేమించకుడి. నీవు లోకమును ప్రేమించినయెడల, దేవుని ప్రేమించలేవు” “లోకములో” ఉన్న మూడు విషయాలు చెప్పుచున్నాడు: శరీరాశ - లైంగిక వాంఛలు, తిండిపోతుతనం, సోమరితనం; నేత్రాశ - చూచినవాటినన్నిటిని కొనాలనే కోరిక, ఇది ధనాపేక్షకు సంబంధించినది మరియు జీవపుడంబము(గర్వము) - ఇది పాపములన్నిటికంటే గొప్ప పాపము. ఈ మూడు విషయాలు లోక వ్యవస్థలో ఉన్నవి. ఈ విషయములను ప్రేమించేవారు దేవుని ప్రేమించలేరు. కాని ఇవన్నియు మరియు లోకము గతించిపోవును. తండ్రి చిత్తము జరిగించువారే నిత్యము నిలుచుదురు (2:17). దీనిని ఎల్లప్పుడు మన మనస్సులో పెట్టుకోవాలి.