వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము
WFTW Body: 

ఒకరినొకరు ప్రేమించుట గూర్చి మూడు విషయములను చెప్పవలెనని అనుకొనుచున్నాను.

1. ప్రేమ మెచ్చుకొనుటను తెలియజేయును.

వివాహజీవితము గూర్చి ఒక పూర్తి పుస్తకమును దేవుడు బైబిలులో చేర్చెను - అది పరమగీతము. వివాహమైన దంపతులందరు దానిని ఒకరికొకరు చదువుకొనవలెను. భార్య భర్తలు ఒకరితో ఒకరు ఎట్లు మాట్లాడుకొనవలెనని అత్యన్నతమైన దేవుడు ఉద్దేశించెనో చూచుట ఆశ్చర్యము కలుగజేయును మరియు ఆ పుస్తకము బైబిలులో యితర పుస్తకముల వలె ప్రేరేపింపబడి వ్రాయబడినది.

భార్య భర్తలుగా మనమందరము ఒకరినొకరు మెచ్చుకొనుట తెలుసుకొనునట్లు ఆ పుస్తకములో కొన్ని భాగములు మీ కొరకు నేను చదువుదును. మెచ్చుకొను విషయము వచ్చేసరికి మనందరము పిసినిగొట్లుగా యుందుము. విమర్శించుటకు మనము త్వరపడు వారుగా యుందుము, కాని మెచ్చుకొనుటకు చాలా నెమ్మదిగా యుందుము. మనము జనులవైపు చూచి వారిలో ఎన్నో తప్పులెంచుదుము. అది మానవ నైజము. మరియు దానిని బట్టియే నేరారోపణ చేయువాడైన సైతాను మనలో కాలు మోపును. దానికి వేరుగా మనము ఒకరిని చూచి, వారిలో మెచ్చుకొనదగినది చూచినప్పుడు మనలో దేవుడు కాలు మోపుటకు వీలగును. మనలో ప్రతి ఒక్కరు ఈ విషయములో మన పద్ధతి ఎట్లున్నదో పరీక్షించుకొనవచ్చును.

పరమగీతములో భర్త ఏమి చెప్పుచుండెనో చూడండి.

నీవు సౌందర్యవంతురాలవు, ఓ నా ప్రియురాలా! తలనుండి కాలివరకు పోల్చలేని సౌందర్యవంతురాలవు మరియు ఏ అవలక్షణము లేనిదానవు. నీవు నా ఊహలలో కనబడనంత సౌందర్యవంతురాలవు. నీ స్వరము నెమ్మది కలుగజేయునది మరియు నీ ముఖము కోరదగినది. నా ప్రియమైన స్నేహితురాలా నీవు అంతరంగమందు మరియు బాహ్యముగాను నీ సౌందర్యము పరిపూర్ణమైనది. నీవు పరదైసువంటి దానవు”.

నీవు నా హృదయమును బంధించితివి. నీవు నా వైపు చూడగా నేను ప్రేమలో పడిపోతిని. నా వైపు నీవు చూచిన ఒక్క చూపుతో నేను ఏమి చెయ్యలేని విధముగా ప్రేమలో పడిపోతిని. నా హృదయము ఎగిరిపోయినది. ఓ! నిన్ను చూడగానే నాలో భావాలు మరియు రేకెత్తించే కోర్కెలు వచ్చుచున్నవి. మరొకరికి నేను పనికి రాకుండా పాడైపోతిని”.

ఈ భూమిపై నీవంటి వారు ఎప్పుడూ లేరు, ఎప్పుడూ ఉండరు. పోల్చుటకు వీలుకాని స్త్రీ నీవు”.

ఇప్పుడు భార్య చెప్పునది వినండి. ఇది ఆమె యొక్క స్పందన.

ఓ నా ప్రియుడా, నీవు అందగాడివి! నీ వంటివారు పదివేలలో ఒకరుందురు. నీవంటి వారెవ్వరూ లేరు! నీవు బంగారము - నీవు పర్వతతుల్యుడవు. నీ మాటలు ఆదరించునవి మరియు అవి ధైర్యము నిచ్చునవి. నీ మాటలు ముద్దులవలె నుండును మరియు నీ ముద్దులన్నీ మాటలే, నీలో ప్రతీది నన్ను సంతోషపర్చును. నీవు నన్ను పూర్తిగా పులకరింపచేయుదువు! నేను నీ కొరకు ఆశగొని యున్నాను మరియు నిన్ను చూడగానే, నా చేతులు నీ చుట్టువేసి నిన్ను గట్టిగా పట్టుకొందును. నిన్ను నేను వెళ్ళనీయను. నేను నీ దానను మరియు నీవు నావాడవు మరియు నీవు నా ఒకే ప్రియుడవు మరియు నీవు నా ఒకే పురుషుడవు”.

అటువంటి మాటలను దేవుడు లేఖనాలలో ఎట్లు ఉంచెను? ఎందుకనగా దేవుడు ఆయనే ఒక ప్రేమికుడు కాబట్టి.

2. ప్రేమ క్షమించుటలో త్వరపడును.

ప్రేమ నిందించుటకు నిదానించును, కాని క్షమించుటకు త్వరపడును. ప్రతి వివాహములో భార్య భర్తల మధ్య సమస్యలుండును. కాని ఆ సమస్యలను అట్లే ఉంచినట్లయితే, అవి తప్పక చికాకులు తెచ్చును. కనుక క్షమించుటకు త్వరపడండి మరియు క్షమాపణ అడుగుటకు త్వరపడండి. దానిని చేయుటకు సాయంత్రము వరకు వేచియుండకండి. నీ కాలిలో ఒక ముల్లు ఉదయమున గుచ్చుకొనినట్లయితే, దానిని వెంటనే తీసివేయుదుము. సాయంత్రమువరకు నీవు వేచి చూడవు. నీవు నీ భాగస్వామిని బాధపెట్టినట్లయితే, నీవు ఆమెను లేక అతడిని ఒక ముల్లుతో పొడిచినట్లే. వెంటనే దానిని తీసివేయుము వెంటనే క్షమాపణ అడుగు మరియు క్షమించుటకు వేగిరపడుము.

3. ప్రేమ తన భాగస్వామితో కలిసి పనిచేయుటకు వేగిరపడును అంతేకాని ఒంటరిగా కాదు.

సైతాను హవ్వను తోటలో శోధించుటకు వచ్చినప్పుడు, “నేను నిర్ణయము తీసుకొనుటకు ముందు నా భర్తను మొదట సంప్రదించనివ్వు” అని ఆమె చెప్పినట్లయితే అప్పుడు ఎంత వ్యత్యాసమైన కథగా ఉండేది! లోకములో సమస్యలన్ని ఒక స్త్రీ నిర్ణయము తీసికొనుటకు ముందు సంప్రదించుటకు ఒక తోడును దేవుడు ఆమెకు యిచ్చినా, ఆమె స్వంతముగా నిర్ణయము తీసుకొనుటవలన వచ్చియున్నవని జ్ఞాపకముంచుకొనుడి.

నిజమైన ప్రేమ పనులను కలసి చేయును. ఇరువురు ఎప్పుడు కూడా ఒక్కటిగా ఉంటే మంచిది.