వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

మత్తయి 9:27లో ఇద్దరు గ్రుడ్డివారు ప్రభువైనయేసు యొద్దకు వచ్చారు. కాని వారిని స్వస్థపరచకముందు, ఆయన వారినిట్లడిగియున్నారు, మీకొరకు నేను ఇది చేయగలనని మీరు "నమ్ముచున్నారా?" వారు, అవును ప్రభువా, నమ్ముచున్నామని చెప్పారు. అప్పుడు ప్రభువైనయేసు "మీ నమ్మికచొప్పున మీకు జరుగుతుందని" చెప్పారు (మత్తయి9:29). ఇది దేవుని నియమము. మన నమ్మికచొప్పున మనం పొందుకుంటాము అంతకంటే ఎక్కువకాదు లేక తక్కువకాదు. ఆ గ్రుడ్డివారికి అద్భుతమవసరమేనా? అవసరమే. ప్రభువు వారికి అద్భుతము చేయాలని కోరియున్నాడా? అవును కోరియున్నాడు. కాని వారికి ప్రభువులో విశ్వాసము లేనట్లయితే అద్భుతము జరుగదు. ఇప్పుడు దీనిని నీకు అన్వయించుకొనుము. దేవుడు నీకొరకు అద్భుతము చేయాలని కోరుచున్నాడా? అవును కోరుచున్నాడు. అయినప్పటికీ నీవు దేవునిలో విశ్వాసముంచనట్లయితే, దానిని నీవు పొందకపోవచ్చును.

ఒకవేళ ఒకగ్రుడ్డివాడు ప్రభువుతో ఇట్లనినయెడల, ప్రభువా నీవు ఒక కన్నును మాత్రమే నిశ్చయముగా తెరువగలవు. నిజానికి అదే నాకు ఎంతో ఎక్కువ, నీ విశ్వాసమును బట్టి నీకు జరుగుతుంది". అతనియొక్క ఒక కన్ను మాత్రమే తెరువబడియుండెడిది. ఒకవేళ రెండవవాడు ఇట్లనినట్లయితే, "ప్రభువా, నీవు నా రెండు కళ్ళను స్వస్థపరచగలవు". అతని విశ్వాసమును బట్టి అతని రెండు కళ్ళు తెరువబడి ఉండేవి.

ఒక కన్నును స్వస్థతపొందినవాడు, ప్రభువైనయేసు ఒక కన్నునే స్వస్థపరచగలడనే "ఒక కన్ను" పరిచర్యను ఆరంభించేవాడు. రెండవవాడు ప్రభువైనయేసు రెండు కళ్ళను స్వస్థపరచగలడనే "రెండుకళ్ళ" పరిచర్యను ఆరంభించేవాడు. అలాగే ఈనాడు కొందరు "ప్రభువైనయేసు మన పాపములను క్షమించగలడని మాత్రమే సువార్త ప్రకటించుచున్నారు. కాని కొందరు, ప్రభువు మన పాపములను క్షమించుట మాత్రమేగాక, పాపముమీద జయమనుగ్రహిస్తాడని ప్రకటించుచున్నారు". అప్పుడు మొదటివాడు "ఇది అసాధ్యము. ప్రభువు ఒక్కకన్ను మాత్రమే స్వస్థపరచగలడు కాబట్టి రెండవవాడిని మతబ్రష్టుడు" అని అంటాడు. ఎందుకనగా అతనిలో ఒక్కకన్ను స్వస్థతపొందే విశ్వాసమే ఉన్నది. రెండవ వానికి రెండు కళ్ళు స్వస్థతనిచ్చే విశ్వాసమున్నది. అతడు పాపక్షమాపణ కొరకు మాత్రమేగాక, జయముకొరకు కూడా విశ్వాసాన్ని కలిగియున్నాడు.

ఈ రెండిటిలో నీవు ఏ గుంపులో ఉన్నావు? ప్రభువైనయేసు కేవలం నీపాపాలను మాత్రమే క్షమించగలడని నీవు విశ్వసించినట్లయితే, నీవు పాపక్షమాపణ మాత్రమే పొందుతావు. కాని నీవు కోపము, మోహము, గర్వము, అసూయ మొదలగు వాటిలో ఓడిపోతూ ఉంటావు. కాని మరొక విశ్వాసి, "రోమా 6:14 ప్రకారము నేను కృపలో ఉన్నాను కాబట్టి పాపము నామీద ప్రభుత్వము చేయదని చెబుతాడు. కాబట్టి ఆ వచనము నాలో అనుభవమై నెరవేరుతుందని ప్రభువును నమ్ముచున్నానని" అంటాడు. ఇతడు రెండు కళ్ళను పొందుతాడు. అతనిని మతబ్రష్టుడని పిలువవద్దు. అతడు నీకంటే ఎక్కువగా ప్రభువులోనుండి పొందుకొనియున్నాడు. ఎందుకనగా అతడు నీ కంటే శ్రేష్టుడుకాబట్టి కాదుగాని అతడు నీకంటే ఎక్కువగా ప్రభువులో విశ్వాసముంచియున్నాడు.