వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   క్రీస్తుయెడల భక్తి
WFTW Body: 

ప్రభువునకు మనము దాసులము కావలెయునని క్రొత్తనిబంధన హెచ్చరించుచున్నది. పౌలు తన్ను తాను యేసు క్రీస్తునకు దాసుడనని పిలుచుచున్నాడు.

పాత నిబంధనలో రెండురకముల సేవకులు ఉండిరి. బానిసలు మరియు జీతమునకు పని చేయు దాసులు. జీతమునకు పనిచేయు దాసునివలె బానిసకు ఎటువంటి జీతము ఇవ్వబడదు . ఒక బానిస తన యాజమానునిచేత వెలబెట్టి కొనబడినవాడు. అందువలన తానుఏమైయున్నాడో అదంతయు మరియు తనకున్నదంతయు తన యజమానునివగును. ఆవిధముగా ప్రతివిశ్వాసి అయి ఉన్నాడని గుర్తించవలెను , ప్రభువు సిలువలో మనలను విలువ పెట్టి కొనియున్నాడు కాబట్టి మనము ఆయనవారమై యున్నాము గనుక మన సమయము, డబ్బు , తలాంతులు , కుటుంబములు , ఆస్తులు , మనస్సులు మరియు మన శరీరములు అన్నియు ఆయనకు చెందియున్నవి(1 కొరింథీ 6:19,20).

రోమా 12:2 లో పాత నిబంధనలోని దహనబలివలే శాశ్వతముగా మన శరీరములను సజీవయాగముగా దేవునికి సమర్పించవలెనని బోధించుచున్నది. పాపపరిహారార్ధబలి వలె కాక దహనబలి సంపూర్ణముగా దేవునికి సమర్పించబడి మరియు బలి అర్పించు వానియొక్క సంపూర్ణ సమర్పణను చూపించుచున్నది, ఒక మనష్యుడు దహనబలి అర్పించినప్పుడు, అతడు ఏమియు తిరిగి పొందడు . ఆ అర్పణతో దేవుడు తన కిష్టమైన దానిని చేయవచ్చును . “తండ్రీ , నా చిత్తము కాదు గాని నీ చిత్తమే జరుగును గాక” అని కల్వరి సిలువలొ తన్ను తాను అర్పించుకొనిన ప్రభువైన యేసునకు సాదృశ్యముగా ఉన్నది. మన శరీరమును సజీవయాగముగా దేవునికి సమర్పించుకొనుట అనగా అర్ధమిదియే: మన సొంత చిత్తమునకు మనము చనిపోయి మరియు మన శరీరము ఎక్కడ మరియు ఏ విధముగా వాడబడవలెనని దేవుడే నిర్ణయించుట. ఆ విధముగా మాత్రమే ఆయన చిత్తమును కనుగొనగలము. అటువంటి సమర్పణ లేనందువలననే దేవుని చిత్తమును తెలిసుకొనలేక పోవుచున్నాము, ప్రభువునకు మన సమర్పణ అనేకసార్లు సంకుచితముగా ఉంటున్నది. దేవుడు అనుమతించిన దానంతటినీ అంగీకరించుటకు సిద్ధముగాలేము.

పూర్తికాలపు క్రైస్తవ పరిచర్య తప్ప మరి ఏ పనియైనను చేయుటకు సిద్ధముగా ఉన్న ఒక సహోదరుడను ఒకసారి కలసితిని. ఈ సంకుచితమే తన జీవితములో దేవుని ప్రణాళికను తెలియకుండా చేసినదని అతనికి చెప్పితిని . చివరకు తన్ను తాను ప్రభువునకు సంపూర్ణముగా సమర్పించుకొనినప్పుడు , వెంటనే తనకు దేవుని చిత్తమును గూర్చిన నిశ్చయత పొందెను . దేవుడు అతనిని పూర్తి కాలపు క్రైస్తవ పరిచర్యకు పిలువ లేదు కాని అతడు దానిని చేయుటకు ఇష్టపడవలెనని దేవుడు కోరెను.

దేవుని చిత్తమును తెలుసుకొనవలెనని వచ్చెడివారనేకులు, తమ కొరకు తాము ఎన్నుకున్న మార్గమునే దేవుడు అంగీకరించవలెనని కోరెదరు . గనుక ఆయన దగ్గరనుండి జవాబుపొందరు. “ప్రభువా! దేనినైనను నీ చిత్తమనే నిశ్చయతను నాకు ఇచ్చినట్లయితే , దానిని అంగీకరించుటకు ఇష్టపడుచున్నాను, నా ప్రభువా! నాకొరకు నీవే నిర్ణయించుము, ఈ విషయములో నా సొంత ఇష్టము లేదు” అని ప్రార్ధిస్తూ మనలను మనము సమర్పించుకొనినయెడల మన సమస్యలు ఎంతో తొందరగా పరిష్కారమగును . అబ్రహాము దేవుని కొరకు ఎక్కడికైనను ఏదైనను చేయుటకు ఇష్టపడియున్నాడు గనుక అతడు “దేవునికి స్నేహితుడయ్యెను”.

ఇగ్లండులోని బ్రిస్టొల్‍కు చెందిన జార్జి ముల్లర్ గొప్ప విశ్వాసముగల వ్యక్తి మరియు దేవుని చిత్తము ఎంతో ఖచ్చితముగా తెలుసుకొనెడివాడు. ఈ విషయములో అతడు ఈ విధముగా చెప్పెను , “దేవుని చేత ఇవ్వబడిన విషయములో నా హృదయములో సొంతచిత్తమేమియు లేకుండా మొదటిగా కోరెదను. ప్రజలకు, పదిలో - తొమ్మిదవవంతు సమస్య ఏదైనప్పటికినీ ఇక్కడ ఉన్నది. మన హృదయములు దేవుని చిత్తము చేయుటకు సిద్ధముగా ఉన్నప్పుడు(9/10) పదిలో తొమ్మిదవవంతు సమస్యలను జయించగలము. ఒక వ్యక్తి ఈ స్థితిలొ ఉన్నప్పుడు , అసాధారణముగా ఆయన చిత్తమును తెలుసుకొనును”.

విధేయత చూపవలెనా లేదా అని నిర్ణయించుటకు ముందుగా దేవుని చిత్తము తెలుసుకొనవలెనని కొంతమంది కోరెదరు. “ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, అతడు తెలిసికొనును” అని యేసు చెప్పెను (యోహను 7:17). దేవుడు ఆజ్ఞాపించినది ఏదైనను చేయుటకు ఇష్టపడినప్పుడు, ఆయన పరిపూర్ణ చిత్తమును తెలిసికొనుటకు అర్హులము కాగలము. ఇది చిన్న మరియు పెద్ద విషయములకు వర్తించును.